టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 13 ఏళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్నాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’లో బరిలోకి దిగేందుకు విరాట్ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ సుమారు మూడేళ్లుగా తన రేంజ్ ఫామ్లో లేడు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవంగా వరుసగా విఫలం అవుతున్నాడు. గతేడాది న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లకు దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ కూడా గట్టిగా చెప్పింది. దీంతో మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు చాలాకాలం తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు.