కచ్చితంగా కనిపించే గుర్తు
తొలిసారిగా శృంగారంలో పాల్గొన్న యువతులలో కచ్చితంగా కనిపించే మార్పు బ్లీడింగ్ అవడం. హైమన్ పొర బ్రేక్ అవడం వల్ల 0.7 నుంచి 9 శాతం మహిళల్లో ఇలా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా పలచటి పొర అయిన హైమన్ పొర యోనిని కవర్ చేస్తూ ఉండే భాగం. చాలా మంది నమ్మకం ప్రకారం, ఈ పొర చీలిపోయినట్లయితే వర్జినీటీ కోల్పోయినట్లు భావిస్తారు. కానీ, అది చీలిపోవడానికి కలయిక ఒక కారణమనే చెప్పాలి. తొలిసారి అంగప్రవేశం జరిగిన తర్వాత అక్కడి చర్మం ఎర్రగా మారిపోయి తీవ్రమైన నొప్పి కలగొచ్చు.