రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక ప్రైవేట్ సాంగ్ షూట్ చేసి సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సింగర్ మధుప్రియ కూడా అలంటి వివాదంలోనే చిక్కుకుంది. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఒక ప్రైవేట్ సాంగ్ ను చిత్రీకరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (Madhu Priya)
కాళేశ్వర దేవాలయంలో సాధారణంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అలాంటిది మధుప్రియ బృందం ఏకంగా నిషేధం అంటే, ఏకంగా గర్భగుడిలో షూట్ చేయడానికి అనుమతి ఎవరిచ్చారు? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మధుప్రియ వాళ్ళు దేవాదాయ శాఖ అనుమతి తీసుకొని షూట్ చేశారా? లేక స్థానిక సిబ్బందిని మేనేజ్ చేసి షూట్ చేశారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.