సినిమా ఇండస్ట్రీపై ఐటీ సోదాల కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, డైరెక్టర్ అనిల్ రావిపూడి నివాసాల్లో.. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే. అటు పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రీ సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.