తిరుమల శ్రీవారిని హీరోయిన్ సంయుక్త మీనన్, సింగర్ మంగ్లీ దర్శించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వారికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త మీనన్.. ఇక్కడికి వస్తే తెలియని ఎనర్జీ వస్తుందన్నారు. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.