కోటి రూపాయల నష్టం
సుమారుగా 50 ఎకరాలలో చెరుకు తోటలు దగ్ధం కావడంతో రైతులకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం ఇప్పపల్లి గ్రామానికి చెందిన పెంటప్ప, సుభాష్, జైపాల్, ఎండి జబ్బర్, ఎండీ షఫీ, ఎండీ జమీర్, ఎండీ అమీర్, అశోక్ రెడ్డి తో పాటు మరి కొంత మందికి చెందిన చెరుకు తోటలు దగ్ధం అయ్యాయి. గ్రామంలో ఉన్న 50 ఎకరాల చెరుకు తోటలు దగ్ధం కావడంతో రైతులకు భారీగా నష్టం జరిగింది. పంట కోయడానికి రెడీగా ఉందని, ఈ నెలలో పంటలు మొత్తం కోసేవాళ్లమని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అందరికి కలిసి కోటి రూపాయాల వరకు నష్టం జరిగిదని చెరుకు రైతులన్నారు. మంటలు ఆర్పేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దగ్గర్లోని, బోరు బావుల నుంచి పైపులతో, బిందులతో మంటలు ఆర్పడానికి విఫల ప్రయత్నం చేశారు. చెరుకు కోతలు జరుగుతున్న సమయంలో దగ్ధం కావడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.