నేటి నుంచి గ్రామసభలు
నేటి నుంచి ఈనెల 24న వరకు గ్రామసభలు నిర్వహించినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు సీఎస్ శాంతి కుమారి చెప్పారు. మరో 1.36 కోట్ల మందికి సంబంధించి 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరానికి అనుగుణంగా తెలియజేస్తామన్నారు. నేటి నుంచి జరిగే గ్రామసభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సూచించారు.