ఏకముఖి రుద్రాక్ష మాల వలన కలిగే లాభాలు ఏంటి?
- రుద్రాక్ష హిమాలయాల్లో అరుదైన చెట్లపై పెరిగే విత్తనాలు. వీటి నుంచి దండలని తయారుచేస్తారు. 14 రకాలు ఇందులో ఉన్నాయి. వాటికి చాలా ముఖాలు ఉంటాయి. వీటిలో ఏకముఖి రుద్రాక్ష అత్యంత అరుదైనది. అలాగే శక్తివంతమైనది.
- పండితులు ప్రకారం, ఏకముఖి రుద్రాక్ష మాల ధరించడం వలన మనస్సుకి అపరిమితమైన శక్తి లభిస్తుంది. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
- చెడు అలవాట్ల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
- ఏకముఖి రుద్రాక్ష ఆధ్యాత్మిక పురోగతికి, స్వీయ జ్ఞానానికి, ధ్యానానికి ప్రభావితమైనదిగా పరిగణించబడుతుంది.
- దీనిని ధరించడం వలన మరణ భయం తొలగిపోవడమే కాకుండా మానసిక ఆందోళన నుంచి కూడా బయటపడడానికి అవుతుంది.
ఏకముఖి రుద్రాక్షను ఎవరు ధరించవచ్చు?
- సనాతన ధర్మం ప్రకారం ఏకముఖి రుద్రాక్ష ధరించే ముందు పండితులు సలహా తీసుకోవడం మంచిది.
- శని దోషం, చంద్రదోషం ఉన్నవాళ్లు ధరిస్తే మంచిది.
- జాతక దోషాలు ఏమైనా ఉంటే ఏకముఖి రుద్రాక్ష తొలగిస్తుంది.
- ఏకముఖి రుద్రాక్షను ధరించేటప్పుడు నల్లటి దారంతో కలిపి వేసుకోవడం మంచిది కాదు.
- ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఎర్రటి దారంతో ఉన్న రుద్రాక్ష వేసుకోండి.
- రుద్రాక్ష మూలమంత్రాన్ని 9సార్లు జపించి ఆ తర్వాత ధరించడం మంచిది.
ఏకముఖి రుద్రాక్షను వేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు
- సోమవారం, అమావాస్య, పౌర్ణమి లేదా శివరాత్రి రోజు ఏకముఖి రుద్రాక్షని ధరించడం మంచిది.
- ఎప్పుడైనా రుద్రాక్ష మాలను వేసుకునే ముందు గంగాజలం లేదా పచ్చిపాలతో కడిగి ఆ తర్వాత ధరించడం మంచిది. అలా వేసుకోవడం వలన రుద్రాక్ష వేసుకున్న ప్రయోజనం కలుగుతుంది.
- బంగారం, వెండి గొలుసుతో పాటు రుద్రాక్షను వేసుకోవచ్చు.
- రుద్రాక్ష మాలను వేసుకునేటప్పుడు ‘ఓం నమ:శ్శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.