మూడు రోజుల క్రిత‌మే బ‌దిలీ

కాకినాడ సీపోర్టుకు సంబంధించిన 41.12 శాతం వాటాల‌ను కేవీరావుకు మూడు రోజుల క్రిత‌మే అర‌బిందో బ‌దిలీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై పై స్థాయిలోని వ్యక్తులు రంగంలోకి దిగి, ఇరు పక్షాల‌ను కూర్చోబెట్టి మ‌ధ్యవ‌ర్తిత్వం చేశారని సమాచారం. పెద్ద స్థాయిలోనే డీల్ కుదిరినట్లు సమాచారం. పోర్టులోని వాటాల‌ను బ‌దిలీ చేసేందుకు సిద్ధప‌డిన అర‌బిందో ఒక ష‌ర‌తు పెట్టింది. సెజ్‌ను వ‌దిలేయాలంటూ ష‌ర‌తు విధించింది. దీనికి స‌మ్మతించిన త‌రువాతే అర‌బిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీరావుకు బ‌దిలీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి అప్పట్లో కేవీరావుకు అర‌బిందోకు ఇచ్చిన మొత్తాన్ని, షేర్లు బ‌దిలీ చేయ‌డంతో తిరిగి అరబిందోకి కేవీరావు ఇచ్చేశార‌ని తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు కేవీరావు వ‌శ‌మైంది. మ‌రోవైపు కాకినాడ సెజ్‌లో ఉన్న కేవీరావుకు చెందిన 8 వేల ఎక‌రాల‌ను అర‌బిందో వశమైంది. ఇప్పుడు ఎవ‌రి వ్యాపారాలు వారు చేసుకోవాల‌ని పెద్దలు రాజీ కుదిర్చిన స‌మ‌యంలో పేర్కొన్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here