AP Liquor Shops : ఏపీ ప్రభుత్వం గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. 335 మద్యం షాపులకు…జిల్లాల వారీగా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లు జారీ చేయనున్నారు. ఈ షాపులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ కుల, నేటివిటీ సర్టిఫికెట్లు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒక షాపునకు నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. గీత కార్మికులు ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. లాటరీలో ఒకటి ఎక్కువ షాపులు వస్తే అభ్యర్థి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీ చేస్తారు.
Home Andhra Pradesh గీతకార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, 335 మద్యం షాపులు కేటాయింపు-ap govt released notification...