కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపూర్ ఘాట్ రోడ్డులో ట్రక్కు అదుపుతప్పి టిప్పన్ ను ఢీకొట్టడంతో లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లంతా కూరగాయలు అమ్మేందుకు సవనూరు నుంచి కుంట యల్లపూర్ మార్కెట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ నారాయణ తెలిపారు.