మిధునం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి; పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.