బాలుడు మంగళవారం సాయంత్రం ముమ్మిడివరంలోని బేకరి వద్ద స్నాక్స్ కొనుగోలు చేస్తుండగా బాలిక తండ్రి వచ్చి బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాలుడు కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు చుట్టుముట్టారు. గాయాలతో విలవిలాడుతున్న బాలుడిని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తున్నారు. దాడి చేసిన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులు వివరించాడు. బాలుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ జీబీ స్వామి ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని తెలిపారు.
Home Andhra Pradesh ప్రేమ పేరుతో వేధింపులు, బాలుడిపై బ్లేడ్‌తో దాడి చేసిన బాలిక తండ్రి-konaseema girl father attacked...