ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
ఆధార్ కార్డులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఏపీలో లేదు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్, అండమాన్, నికోబార్ రాష్ట్రాలకు ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులకు సంబంధించిన ప్రజలు ఆధార్ కార్డుల్లో ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ వెళ్లాల్సిందే.