ఏవోబీలో అలర్ట్..
ఇక మిగతా వారంతా ఏవోబికి చేరుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏవోబీలో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ, ఇతర దళనేతలు ఉదయ్, జగన్, సురేష్‌తోపాటు.. మరో 15 మంది ప్రస్తుతం ఏవోబీలోనే ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. వీరి కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం.