ఈ స్మార్ట్ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందిస్తారు. నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం స్మార్ట్ఫోన్ ఐపీ54 రేట్ పొందింది. ఇందులో రెయిన్ వాటర్ టచ్ ఫీచర్, ఎయిర్ గెస్చర్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి.