చియా సీడ్ పుడ్డింగ్
చియా విత్తనాలు చిన్నవి. కానీ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. నీటితో కలిపినప్పుడు, అవి జెల్ లాంటి ఆకారాన్ని పొందుతాయి. చియా విత్తనాలలో ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఈ రెండూ డయాబెటిస్ నిర్వహణకు సహాయపడతాయి. చియా విత్తనాల్లోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చియా సీడ్ పుడ్డింగ్ తయారు చేయడానికి, చియా విత్తనాలను తియ్యని బాదం పాలు లేదా పెరుగులో వేసి నానబెట్టాలి. మీరు దానిపై కొన్ని బెర్రీలు లేదా గింజలను చల్లి తినవచ్చు.