బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వాట్సప్ హ్యాక్ అయ్యింది. వాట్సప్ లో కలెక్టర్ వెంకట మురళి చిత్రం హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. రకరకాల మెసెజ్ లు పంపిస్తున్నారు. వెంటనే గమనించిన జిల్లా అధికారులు,ఉద్యోగులు విషయం కలెక్టర్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన గురించి చెప్పారు. ఎవరు మెసెజ్ లకు స్పందించవద్దని కలెక్టర్ కోరారు.