భక్తితో పాటు సందేశం
యువతను జాగృతం చేయడం, మాదకద్రవ్యాలను నిర్మూలించడం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం, భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చడమే లక్ష్యమని పహిల్వాన్ బాబా చెప్పారు. ‘‘నా వయస్సు 50 సంవత్సరాలు. నేను ఒక చేత్తో 10,000 పుష్ అప్ లు చేయగలను. ఈ వయసులో నేను అంత కష్టపడగలిగితే, యువత నాలుగు రెట్లు ఎక్కువ చేయగలదు’ అని రాజ్‌పాల్ సింగ్ అన్నారు.