స్టార్ హీరో యష్(yash)సుదీర్ఘ విరామం తర్వాత  కొంత గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్'(Toxic)అనే ఒక విభిన్నమైన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.కేజీఎఫ్ మొదటి రెండు పార్ట్ లు విజయవంతమవడంతో అభిమానులు,ప్రేక్షకుల అంచనాలని అందుకోవాలనే లక్ష్యంతో ‘టాక్సిక్’ ని యష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.ఇటీవల యష్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకోని చిన్నపాటి టీజర్ లాంటిది రిలీజయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ ని సాధిస్తుంది.

ఇక ఈ మూవీ ప్రకటించినప్పట్నుంచి యష్ పేరు తప్ప మిగతా నటీనటుల వివరాల్ని వెల్లడి చెయ్యలేదు.కొన్ని రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ తమ సినిమాలో ఒక భాగమని చిత్ర బృందం అధికారకంగా వెల్లడి చేసింది.రీసెంట్ గా అక్షయ్ ఒబెరాయ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara)కూడా మా సినిమాలో భాగమయ్యింది.ఇంతకు మించి నేనేమి చెప్పలేను.త్వరలోనే ఈ విషయంపై దర్శకురాలు గీతు మోహన్ దాస్ ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చాడు.

ఇక ‘టాక్సిక్ ‘లో నయన్  ఖాయమైన నేపథ్యంలో ఆమె పోషించే క్యారక్టర్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.టాక్సిక్ ‘యష్’ నుంచి వస్తున్న పంతొమ్మిదవ చిత్రం కాగా ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.కెవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి యష్ నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.     

                                                                                                                                            


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here