తేనె సహజంగా తీపిగా ఉంటుంది. తేనే రుచితో పాటూ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 100 గ్రాముల తేనెలో 304 కేలరీలు ఉన్నాయి. ఇది పిండి పదార్ధాలు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరల నుండి వస్తుంది. తేనె గొప్ప శక్తి వనరు. తేనెలో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. కొవ్వు ఉండదు. తేనెలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజాలు ఉన్నాయి. తేనెలోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు వీటితో సహా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఉదయాన్నే పరగడుపున తేనె తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.