చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య నాడు ఏం చేయాలి?

  1. చొల్లంగి అమావాస్య నాడు విష్ణుమూర్తి వైద్య వీర రాఘవస్వామిగా అవతరించారు. అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయట పడడానికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి పూజ చేయడం మంచిది.
  2. ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు.
  3. చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  4. పితృదేవతలకు తర్పణాలు కూడా ఇవ్వచ్చు.
  5. చొల్లంగి అమావాస్యనాడు ఎవరైతే ఇంట్లో అనారోగ్య సమస్యతో బాధపడతారో వారి కోసం వెండి కడియాన్ని పూజలో పెట్టి, ఆ తర్వాత వాళ్ళు దానిని ధరించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  6. ఈ అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది.
  7. లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.
  8. తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి. ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు.
  9. ఈ రోజున అసత్యం పలకరాదు.
  10. మౌనంగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలను, స్త్రీలని, పిల్లలను ఈరోజు బాధించకూడదు.
  11. ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు.
  12. రావి చెట్టు చుట్టూ ‘నారాయణ నమః’ అంటూ 27 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం చదువుకోవచ్చు.
  13. నల్ల నువ్వులు, వస్త్రం, ఉసిరికాయని దానం చేస్తే ఈరోజు చాలా మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here