సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు ఇన్కమ్ టాక్స్ తనిఖీలపై దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పందించిన డైరెక్టర్.. తన ఇల్లు ఇంకా సుకుమార్ ఇంటి పక్కకు రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడెక్కడో మా డ్రైవర్ల ద్వారా సమాచారాన్ని కనుక్కొని వస్తున్నట్లు తెలిసిందని.. తమని అడిగితే చెబుతాం కదా అని అనిల్ రావిపూడి బదులిచ్చారు.