ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో…
హత్య మూవీలో యాక్టింగ్ పరంగా ఐపీఎస్ ఆఫీసర్ సుధ పాత్రలో ధన్య బాలకృష్ణకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి తరహా బబ్లీ క్యారెక్టర్స్ చేసిన ధన్య…పోలీస్ పాత్రలో చక్కటి వేరియేషన్ చూపించింది. ధర్మేంద్రరెడ్డిగా రవివర్మ, సలీమా పాత్రలో పూజ రామచంద్రన్ నటన బాగుంది. కిరణ్ రెడ్డిగా భరత్ ఏపీ మాజీ సీఏంను కొన్ని చోట్ల గుర్తుచేశారు. మేనరిజమ్స్‌ను దించేశారు. లిమిటెడ్ క్యారెక్టర్స్, బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్లుగా బీజీఎమ్‌తోనే నరేష్ కుమారన్ టెన్షన్ బిల్డ్ చేశారు. డైరెక్టర్‌గా శ్రీవిద్య ఒకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్‌జీవీని గుర్తుచేసింది.