ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు విద్యార్థులంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత. కష్టపడి చదివి కలెక్టర్‌గా ఉన్నతస్థాయికి రావడంతో తనలాగే పది మంది ఎదిగేందుకు సహాయం చేయాలని ఈ కలెక్టర్ ఎప్పుడూ తహతహలాడుతుంటారు. అందుకే విద్యార్థులతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఇటీవల సంక్రాంతి పండగ వేళ అనాథ పిల్లలను ఆయన కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. ప్రభుత్వ బాలికల సదనంలో ఉండే 25 మంది చిన్నారులకు మజమ్మిల్ ఖాన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారందరినీ ఓ పెద్ద స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. దీంతో ఆయన్ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here