Maharashtra blast: మహారాష్ట్రలోని భండారా జిల్లా జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కుప్ప కూలింది. ఆ శిథిలాలను తొలగించేందుకు ఎర్త్ మూవర్లను రంగంలోకి దించారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడును దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు. ‘‘ఓ విషాదకర సంఘటన జరిగింది. భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరూ ఒక నిమిషం నిలబడి మౌనం పాటించాలని నేను కోరుతున్నాను’’ అని గడ్కరీ నాగ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here