లాంచ్ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. “యాక్టివా కేవలం స్కూటర్ మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని కోట్లాది కుటుంబాలకు నమ్మకమైన సహచారి. ‘స్కూటర్ బోలే తో యాక్టివా’ అనే ట్యాగ్‌లైన్‌కి సగర్వంగా కట్టుబడి ఉంది,” అని అన్నారు. “బ్లూటూత్ కనెక్టివిటీ- నావిగేషన్‌తో కూడిన 4.2-ఇంచ్ టిఎఫ్టీ డిస్ప్లే, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో కొత్త 2025 యాక్టివా వస్తోంది. భారతదేశానికి ఎంతో ఇష్టమైన స్కూటర్‌గా, యాక్టివా ఎల్లప్పుడూ సౌలభ్యం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఓబీడీ2బీ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పరిశుభ్రమైన భవిష్యత్తు దిశగా మరో అడుగు ముందుకు వేయడం సంతోషంగా ఉంది,” అని తెలిపారు.