సోయా(మీల్మేకర్) ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని కూరగాయలతో పాటు పులావ్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు. కానీ మీల్మేకర్లతో మీరు ఎప్పుడైనా కబాబ్‌లను ప్రయత్నించారా? చేసి ఉండకపోతే ఈ సారి ట్రై చేసి చూడండి. సోయా కబాబ్ లు చాలా రుచికరంగా ఉండటంతో పాటు తయారు చేయడం కూడా చాలా సులువు. లేకపోతే, ఈ రుచికరమైన సోయా కబాబ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువులతో కేవలం 15నిమిషాల్లో సోయా కబాబ్ లను తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.