శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై అల్లు అర్జున్(Allu Arjun)హీరోగా తెరకెక్కిన ‘ఆర్య’తో మొదలుకొని మొన్న సంక్రాంతికి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankrathiki Vasthunnam)దాకా ఎన్నో హిట్ చిత్రాలని అందించారు నిర్మాత దిల్ రాజు(Dil Raju).గత కొన్ని రోజుల నుంచి ఆయనపై ఐటి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.దిల్ రాజు ఇల్లు,కార్యాలయం,బంధువుల ఇల్లులు లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడుల గురించి మీడియాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాపై  ఐటి దాడులు జరిగాయి.మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి.ఇందులో రాజకీయ కుట్ర ఉందనే వార్తలు కొన్ని మీడియా సంస్థల్లో ప్రసారం అవుతున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు.ప్రాసెస్ లో భాగంగానే ఐటి దాడులు జరుగుతున్నాయి.నా ఒక్కడి మీదే ఈ దాడులు జరగడం లేదు కదా. మైత్రి,అభిషేక్ వాళ్ల మీద కూడా జరుగుతున్నాయి.నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయని, కీలక డాక్యుమెంట్ లు దొరికాయని వార్తలు వస్తున్నాయి.ఆ వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు.మా దగ్గర ఏమి లేవని,అధికారులే ఆశ్చర్య పోతున్నారు. నా ఇంట్లో,నా కూతురు,తమ్ముడి ఇంట్లో కలిపి  24 లక్షలు ఉండటం ఐటి వాళ్ళు గుర్తించారు.ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ప్రాపర్టీస్ కొనడం గాని, ఇన్విస్ట్మెంట్ లు చెయ్యడం గాని జరగలేదు.

ఒక సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లావాదేవీలు ఏ విధంగా జరుపుతారో అని అధికారులు అడిగి ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది.ఇక మా మదర్ హెల్త్ విషయంపై కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.లంగ్ ఇన్ఫెక్షన్ పెరగడంతో జలుబు లాగా వచ్చింది.దాంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.ఈ రోజు డిచ్ఛార్జ్ అవుతారు.ఇక 2025 నుంచి ఎలాంటి సూపర్ హిట్ లు కొట్టాలనేదే నా పని అని చెప్పుకొచ్చాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here