రేసులో ఎవరెవరు..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. షార్ట్ లిస్ట్‌లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు.. రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది.