పుష్ప 2 సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. మూడేళ్ల కిందట వచ్చి సెన్సేషన్ హిట్ అయిన తొలి భాగంతో అంచనాలు భారీగా నెలకొనగా.. ఈ సీక్వెల్‍ను కూడా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రం దుమ్మురేపేసింది. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, జగదీశ్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.