TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా జరిగిన గ్రామసభల్లో ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితాను ప్రకటించారు. గ్రామాలవారీగా పేర్లను ఖరారు చేశారు. అంతేకాకుండా కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే అందరిలోనూ ఫైనల్ లిస్ట్ ఆసక్తిని రేపుతోంది.