మారుతి సుజుకి ఫ్రాంక్స్
ఈ ఎస్‌యూవీ ఏప్రిల్ 2023 నెలలో ప్రారంభమైంది. మంచి డిజైన్, ఫీచర్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో అమ్ముడైంది. కారును కూడా అప్‌డేట్ చేసి అమ్మకానికి తీసుకువచ్చేందుకు రెడీ చేస్తోంది. కొత్త కారు 2026 లేదా 2027లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందుబాటులో ఉన్న కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర కనిష్టంగా రూ.7.51 లక్షలు, గరిష్టంగా రూ.13.04 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెట్రోల్ అండ్ సీఎన్జీ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు వస్తాయి.