కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, దీపికతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన కీరోల్స్ చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఈ సినిమా సుమారు రూ.1,200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని సూపర్ హిట్ అయింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించారు. కల్కి 2898 ఏడీ సినిమా క్లైమాక్స్‌లో కర్ణుడి పాత్ర రివీల్ సహా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. దీంతో కల్కి 2పై చాలా ఆసక్తి నెలకొంది.
Home Entertainment Kalki 2 Update: కల్కి 2 సినిమాపై అదిరిపోయే అప్డేట్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.....