హీరో ఎక్స్‌పల్స్ 210: టాప్ వేరియంట్..
హీరో ఎక్స్‌పల్స్ 210 టాప్ ట్రిమ్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌గా వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 4.2 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ సహా మరెన్నో ఫీచర్స్‌ని కలిగి ఉంది. అలాగే, ఈ వేరియంట్ ట్రాన్స్పరెంట్ విండ్‌స్క్రీన్, నకిల్ గార్డులు, లగేజీ ర్యాక్‌తో వస్తుంది. 170 కిలోల బరువున్న ఈ అడ్వెంచర్ బైక్ టాప్ ట్రిమ్ అజూర్ బ్లూ, ఆల్పైన్ సిల్వర్ అనే రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ .185,800 (ఎక్స్-షోరూమ్).