మరదలు
మరదలు, వదినల మధ్య అనుబంధం కూడా అత్తగారింట్లో చాలా ప్రత్యేకం. భర్తకు చెల్లి లేదా అక్క ఉంటే వారితో కూడా కోడలి కలిసిపోతేనే సంతోషంగా ఉండాలి. వివాహం చేసుకుని తన అత్తవారింటికి చేరుకున్నప్పుడు, ఆమె తన మరదలిలో ఒక స్నేహితురాలిలా, గురువులా, సోదరిలా కలిసిపోతేనే సంతోషంగా ఉండగలదు. ఈ బంధం ఎంత బలంగా ఉంటే ఇంటి వాతావరణం అంత సంతోషంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మరదలు కూడా బయటకు వచ్చి కోడలి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేస్తుంది. కోడలిని అవమానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. కొన్నిసార్లు కోడలి మీదకి తమ తల్లి, సోదరుడిని రెచ్చగొట్టేందుకు కూడా ప్రయత్నిస్తుంది. అలాంటి మరదళ్లు, వదినల వల్ల కూడా వివాహితలు కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు.