త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్..
అతి త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్ నిర్వహించి.. స్థానికంగా ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు తెలియజేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా.. పాపికొండల పర్యాటకం విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో అడ్వెంచర్, ఎకో, వెల్‌నెస్, ఆలయ, హెరిటేజ్, అగ్రి, మెడికల్, బీచ్ పర్యాటకాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.