ఇటీవలికాలంలో టాలీవుడ్ ప్రముఖులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వారిలో కొందరు అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్‌పై బయటికి రావడం మనం చూశాం. అలాంటి కేసుల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కొంతకాలం మీడియాలో ప్రధానాంశంగా మారింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రష్టివర్మ అనే కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ప్రధాన ఆరోపణ. తను మైనర్‌గా ఉన్న సమయం నుంచి తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకొని 36 రోజులపాటు జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్‌పై జానీ మాస్టర్ బయటికి వచ్చారు. యధావిధిగా తన పని చేసుకుంటూ వెళుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా బాధితురాలు శ్రష్టివర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కేసుకు సంబంధించి పలు అంశాల గురించి ప్రస్తావించింది. ‘నాలాంటి అమ్మాయిలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నాను. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని కొందరు అమ్మాయిలైనా తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. జానీ మాస్టర్‌పై పగ సాధించేందుకు నేను ఈ కేసు పెట్టలేదు. నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారని అందరూ అడుగుతున్నారు. అప్పుడు నేను మైనర్ని కావడం వల్ల కేసు పెట్టేంత ధైర్యం నాకు లేదు. అలాగే దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. నేను ఇన్నాళ్ళూ అతనిలో మార్పు వస్తుందని ఎదురుచూశాను. మార్పు రాకపోగా, వేధింపులు మరింత పెరిగాయి. అందుకే పోలీసులను ఆశ్రయించాను. అతనిపై ఈ కేసు పెట్టడం వెనుక అల్లు అర్జున్ ఉన్నారని వార్తలు వచ్చాయి. నిజానికి నా వెనుక ఎవరూ లేరు. కేసు పెట్టమని నాకు ఎవరూ చెప్పలేదు. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు ప్రముఖ వ్యక్తుల ప్రోత్సాహంతోనే అతనిపై కేసు పెట్టానని ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదు. అంతేకాదు జానీ మాస్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డు రద్దు కావడానికి కారణం కూడా నేనేనని ప్రచారం జరిగింది. కానీ, నేను అలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు లాయర్నే పెట్టుకోలేదు. నా లాయర్ ఏదో లెటర్ రాశారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు శ్రష్టివర్మ.