పుష్ప2(Pushpa 2),యానిమల్(Animal)తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించిన హీరోయిన్ రష్మిక(Rashmika).దీంతో కన్నడ భాషకి చెందిన ఈ భామ నేషనల్ క్రష్ అనే టాగ్ లైన్ ని,అభిమానులు,ప్రేక్షకులు,సినీ ట్రేడ్ వర్గాల నుంచి అందుకుంది,అందుకే తగ్గట్టే వివిద భాషల్లో సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో ఆమె నటించిన ‘చావా’ అనే హిందీ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్ కూడా అంచనాలకి మించి ఉండటంతో ‘మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

మరాఠా యోధుడు ఛత్రపతి ‘శివాజీ'(Chhatrapati Shivaji Maharaj)తనయుడు ‘శంభాజీ మహారాజ్'( Chhatrapati Sambhaji Maharaj )  జీవిత కథ ఆధారంగా ‘చావా’ తెరకెక్కింది.ఇప్పుడు ఈ చిత్రం గురించి మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ మాట్లాడుతు శంభాజీ జీవిత కథ ఆధారంగా చావాని తెరకెక్కిస్తున్నందుకు టీం అందరకి నా ధన్యవాదాలు.కానీ ‘చావా’ట్రైలర్ ని చూస్తుంటే శంభాజీ మహారాజ్ డాన్స్ చేస్తున్నట్టుగా చూపించారు.ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు.వెంటనే ఆ సీన్ తొలగించాలి.లేదంటే సినిమాని అడ్డుకోవడంతో పాటు తీవ్ర పరిణామాలు తప్పవు.విడుదలకి ముందే ‘చావా’ని చరిత్రకారులు,స్కాలర్స్ సాధించిన వారికి చూపించాలి.వాళ్ళు సినిమా చూసి ఏదైనా అభ్యంతరం చెప్తే  విడుదలకి అంగీకరించమని చెప్పుకొచ్చాడు. 

శంభాజీ మహారాజ్ క్యారక్టర్ లో విక్కీ కౌశల్ చేస్తుండగా ఆయన భార్య యేసుబాయిగా రష్మిక చేస్తుంది.ఇటీవలే రిలీజైన యేసుబాయి ప్రచార చిత్రాలు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచాయి.లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘చావా’లో అక్షయ్ ఖన్నా,అశుతోష్ రానా,దివ్య దుత్త, వినీత్ కుమార్ కీలక పాత్రలు పోషించగా,దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించాడు.130 కోట్ల భారీ వ్యయంతో ‘చావా’ తెరకెక్కింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here