బొడ్డుతాడు గర్భిణీ స్త్రీ శరీరంలో ఒక భాగం. ఇది తల్లి నుంచి శిశువుకు పోషణను, రక్షణను అందిస్తుంది. తల్లి తిన్న ఆహారం నుంచి గర్భస్థ శిశువుకు పోషకాలు, రక్తం చేరేది కల్పిస్తుంది. ఇది తల్లీబిడ్డలను కలుపుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత, డాక్టర్ దానిని జాగ్రత్తగా కత్తిరిస్తారు. కాని ఇది శిశువు నాభి నుంచి ముక్కలా వేలాడుతుంది. దానికి క్లిప్ పెట్టి ఉంచుతారు వైద్యులు. కొన్ని రోజుల వరకు అది అలాగే ఉంటుంది. తరువాత అది తనకు తానే ఊడిపోతుంది. ఇది పడిపోవడానికి 5 నుండి 10 రోజులు పడుతుంది. అయినప్పటికీ, బొడ్డు తాడు పడిపోయే వరకు దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. శిశువు బొడ్డు తాడు సంరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.