మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ED, CBIలకు భయపడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. తన అల్లుడి విషయంలో కొన్ని నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయని అందువల్లే రాజీనామా చేశారని అన్నారు. వైసీపీకి, వైఎస్ జగన్‌కు అత్యంత విధేయుడిగా వ్యవహరించిన విజయ సాయి పార్టీ తరపున ఢిల్లీలో ప్రాతినిథ్యం వహించారు అని గుర్తు చేశారు.