హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘రజాకార్’ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా గతేడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పది నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజాం పాలకుల దురాగతాల ఆధారంగా అప్పటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనసూయ భరద్వాజ్, మకరంద్ దేశ్‍పాండే ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో రజాకార్ మూవీకి అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here