ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు లెక్కలు వేరే ఉంటాయి. ఒకట్రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన.. ఆయన వెనుకబడిపోడు. ప్రొడ్యూసర్ గా వచ్చిన నష్టాలను డిస్ట్రిబ్యూటర్ గా.. డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన నష్టాలను ప్రొడ్యూసర్ గా కవర్ చేస్తుంటాడు. ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయినా.. అసలు నష్టాలే రాకుండా తెలివిగా పావులు కదుపుతుంటాడు. ఈ సంక్రాంతికి కూడా అలాంటి తెలివైన అడుగులతోనే అందరినీ సర్ ప్రైజ్ చేశాడు దిల్ రాజు. 

 

ఈ సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇలా మూడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను దిల్ రాజు నిర్మించగా.. ‘డాకు మహారాజ్’కి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. దీంతో ప్రేక్షకులు మూడో సినిమాల్లో ఏది చూసినా.. దిల్ రాజుకే లాభమని, ఆయనది మామూలు తెలివి కాదని అందరూ భావించారు. కానీ అందరూ ఊహించిన దానికంటే.. ఇంకా తెలివిగా దిల్ రాజు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. (Game Changer)

 

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారని అందరూ భావించారు. కానీ దిల్ రాజు వేసిన తెలివైన అడుగులతో ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలో ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ ని కలిపి అమ్మేశాడట దిల్ రాజు. దాంతో ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదట. అదెలాగంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ ను దిల్ రాజు దాదాపు రూ.155 కోట్లకు అమ్మేశాడట. ఈ రెండు సినిమాలు కలిపి ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో రూ.180 దాకా షేర్ రాబట్టాయి. ఇందులో మెజారిటీ కలెక్షన్లు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ద్వారా వచ్చినవే కావడం విశేషం. (sankranthiki Vasthunam)

 

పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ దారుణంగా నిరాశపరిస్తే.. రీజినల్ మూవీగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకొని సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ రైట్స్ కలిపి కొన్న బయ్యర్లు అందరూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వల్ల సేఫ్ అయ్యారు. అంతేకాదు కొంతమంది బయ్యర్లు భారీ లాభాలను కూడా చూస్తున్నారు. ఏది ఏమైనా ఇలా రెండు సినిమాల రైట్స్ ని ప్రతి ఏరియాలో ఒకే బయ్యర్ కి ఇవ్వాలన్న దిల్ రాజు ఆలోచన కారణంగా.. ఒక్క బయ్యర్ కూడా నష్టపోలేదని తెలుస్తోంది. దీంతో దిల్ రాజు మామూలోడు కాదు, మాస్టర్ మైండ్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here