అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప-2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ వసూళ్లపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఐటీ రైడ్స్ జరిగినప్పటి నుంచి ఈ చర్చలు మరింత పెరిగాయి. (Pushpa 2 Collections)

 

ఇటీవల టాలీవుడ్ కి చెందిన పలు నిర్మాణ సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. వాటిలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉంది. ఐటీ రైడ్స్ జరిగినప్పటి నుంచి పుష్ప-2 కలెక్షన్ల అసలు లెక్క తేలిందంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వచ్చిన కలెక్షన్స్ ని మేకర్స్ రూ.500 కోట్లు తక్కువ చేసి చూపించారని, నిజానికి ‘పుష్ప-2’ రూ.2300 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం.. వచ్చిన కలెక్షన్స్ కి రూ.500 కోట్లు ఎక్కువ చేసి చూపించారని, నిజానికి వచ్చింది రూ.1300 కోట్ల లోపే అని కామెంట్స్ చేస్తున్నారు. (Pushpa 2 The Rule)

 

 

అయితే ఈ ‘పుష్ప-2’ కలెక్షన్ల చర్చ కన్నడలో కూడా జరుగుతోంది. అక్కడి మీడియా, సోషల్ మీడియాలో ‘పుష్ప-2’ కలెక్షన్స్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. ఐటీ రైడ్స్ తో ఈ ఫేక్ భాగోతం బయటపడిందని చెబుతున్నారు. అలాగే ఒరిజినల్ గా ‘కేజీఎఫ్-2’ కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్-2’ రూ.1250 కోట్లు కలెక్ట్ చేస్తే.. ‘పుష్ప-2’ రూ.1200 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, కానీ రూ.1800 కోట్లు అంటూ ఫేక్ చేశారని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తెలుగు ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ ని తిప్పికొడుతున్నారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here