మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే మూవీ ‘విశ్వంభర’ అనే విషయం తెలిసిందే.ఫాంటసీ,యాక్షన్ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.నిజానికి ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో అడుగుపెట్టాల్సింది.కానీ గేమ్ చేంజర్ కోసం వెనక్కి వెళ్ళింది.
చిరంజీవి రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి వికారాబాద్ జిల్లా ప్రొద్దుటూరులో పద్మశ్రీ అవార్డు గ్రహీత,ప్రకృతి ప్రేమికుడైన రామ్ దేవ్ ఏర్పాటు చేసిన ‘ఎక్స్ పీరియం పార్క్ ని’ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా చిరు మాట్లాడుతు’ఈ ప్లేస్ మీ అందరి కంటే నాకే ముందు తెలుసు.2002 లో రామ్ దేవ్ దీన్ని ప్రారంభించేటప్పుడు నా దగ్గరకి వచ్చాడు.ఇల్లు కడుతున్నారని తెలిసింది,నా దగ్గర ఉన్న మొక్కలు ఉపయోగపడతాయా అని అడిగాడు.ఆ మొక్కలు చూసి విదేశాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు చూసీ టెంప్ట్ అయ్యే వాడ్ని కదా అని అనుకున్నాను.ఆ తర్వాత జైల్లో కటకటకటాలు ఎలా ఉంటాయో,ఆ స్టైల్లో మొక్కలు డిజైన్ చేసి ఇచ్చాడు. ఎవరైనా వాటి వెనుక ఉన్న నన్ను చూస్తే,నేను జైలులో ఉన్నట్టుగా అనిపిస్తుంది.2002 నుంచే రామ్ దేవ్ మొక్కలు నా ఇంట్లో ఉన్నాయి.
రామ్ దేవ్ ని ఎప్పుడు చూసినా కూడా వ్యాపారవేత్తలా కనపడకుండా,కళాత్మకత ఉన్న వాడిలా కనపడతాడు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తిరుగుతుంటే ఆ మొక్కలు మొత్తం మా ఇంట్లో పెట్టుకోవాలనేంత టెంప్డ్ గా ఉంది.కాకపోతే ఇప్పుడేమో కోట్ల రూపాయిల రేట్ చెప్తున్నాడు.నా సంపాదన అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకొచ్చారు. ‘ఎక్స్ పీరియం పార్క్’ లో రకరకాల వృక్షసంపదతో పాటు మొక్కలకి సంబంధించిన ఎన్నో ఆధునిక డిజైన్స్ ప్రతి ఒక్కరిని అబ్బురపరిచే విధంగా ఉన్నాయి.