అమెజాన్ అడవుల నేపథ్యంలో,యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా తెరకెక్కుతున్న ssmb 29 ఇటీవలే అధికారకంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.పాన్ వరల్డ్ ఆడియెన్స్ టార్గెట్ లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంకచోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుంది.రెండు రోజుల క్రితం రాజమౌళి(Rajamouli)సోషల్ మీడియా వేదికగా మూవీలో ఒక భాగమైన సింహాన్ని లాక్ చేయడానికి వెళ్తున్నట్టుగా ఒక పిక్ షేర్ చేసాడు.దీంతో షూటింగ్ మొదలయ్యిందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.
ఇక ఈ మూవీ కోసం రాజమౌళి చాలా కఠినమైన నిర్ణయాలని తీసుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అందులో భాగంగా మహేష్(Mahesh Babu)తో పాటు మూవీకి పని చేసే యూనిట్ మొత్తం చేత ఒక అగ్రిమెంట్ చేయించుంటున్నట్టుగా తెలుస్తుంది. బాహుబలి సిరీస్,ఆర్ఆర్ఆర్ కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా,ఆ రెండిటికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ కి ముందుగానే లీక్ అయ్యాయిసెట్స్ నుంచి మొదలుకుని ఎడిటింగ్ రూం,వీఎఫ్ఎక్స్ స్టూడియోల దాకా,ఏదో విధంగా లీక్ అవుతు వస్తున్నాయి.తద్వారా సినిమాకు డ్యామేజ్ చాలా జరుగుతుంది.
అందుకే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా 24 క్రాఫ్ట్స్ చేత నాన్ డిస్క్లోజ్అగ్రిమెంట్లను చేయించుకుంటున్నారనే టాక్ వినపడుతుంది.ఈ అగ్రిమెంట్ ప్రకారం సెట్స్ లో తీసుకన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం,ఇతరులతో పంచుకోవడం, మీడియాకి చెప్పడం కూడా చేయకూడదు.ఒకవేళ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్‌ని ఉళ్లంగించినట్లయితే కఠినంగా కూడా వ్యవహించనున్నారు.భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో పాటు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.దాదాపు ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకున్న ఈ మూవీలో భారతీయ నటులతో పాటు ప్రపంచ నటులు కూడా కనించనున్నారనే టాక్ వినపడుతుంది.ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి చాలా సీక్రెట్‌ని మెయింటెన్ చేసుకుంటు వస్తున్నాడు.