మూవీ: పోతుగడ్డ

నటీనటులు: ఆడుకాలం నరేన్, శత్రు, పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ తదితరులు

ఎడిటింగ్: ఎస్.జె‌ శివకిరణ్

సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీ వాస్తవ్

మ్యూజిక్: శ్రావణ్ భరద్వాజ్

నిర్మాతలు: అనుపమ చంద్ర, శరత్ చంద్ర

దర్శకత్వం: రక్ష వీరమ్

ఓటీటీ : ఈటీవి విన్

ఆడుకాలం’ నరేన్, శత్రు ప్రధాన పాత్రల్లో… పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ జంటగా నటించిన ‘పోతుగడ్డ’ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం.

కథ: 

కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో సముద్ర (ఆడుకాలం నరేన్) సిట్టింగ్ ఎమ్మెల్యే. పదేళ్లుగా ఆ పదవిలో ఉంటాడు. ఎన్నికలు రావడంతో అతని మీద ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా భాస్కర్ (శత్రు) రంగంలోకి దిగుతాడు. డబ్బులు పంచడానికి కోట్లకు కోట్ల రూపాయలు రెడీ చేస్తాడు. మరోవైపు మహిళలు, యువత ఓట్లకు గాలం వేయడానికి సముద్ర తన కూతురు గీత (విస్మయ శ్రీ)ని పార్టీలో ‘జిల్లా యూత్ ప్రెసిడెంట్’ చేస్తాడు. రాజకీయాలు అంటే ఇష్టం లేని గీత ఇంటి నుంచి పారిపోతుంది. ప్రేమించిన అబ్బాయి కృష్ణ (పృథ్వీ దండమూడి)తో కలిసి బస్సులో వెళుతుంది. ఆ విషయం సముద్రకు తెలుస్తుంది. అదే బస్సులో భాస్కర్ డబ్బు ఉంటుంది. సముద్ర అమ్మాయి లేచిపోయిన విషయం భాస్కర్ తెలుసుకున్నాడా? ఒకవేళ తెలిస్తే ఏం చేశాడు? సముద్ర, భాస్కర్ ల మధ్య ఉన్న గొడవలేంటి? వాళ్ళ ప్రేమ విజయం సాధించిందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

గంట యాభై రెండు నిమిషాల నిడివితో మొదలైన ఈ సినిమా పరువు హత్యలు, ప్రేమ అనే లైన్ తో సాగుతుంది. మరి ఇది వర్కవుట్ అయిందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే స్టోరీ పాతదే కానీ తీసే విధానం అయిన కొత్తగా ఉంటే బాగుండేది. అదీ లేదు. పోతుగడ్డ అనే ఊర్లో ఉన్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్య సాగే తీవ్ర కక్ష్యా రాజకీయాల మధ్య ఓ ప్రేమజంట ఎలా తమ ప్రేమని విజయం సాధించనే పాయింట్ తో కథని రాసుకున్నారు కానీ అందులో  డెప్త్ లేదు. 

హీరో, హీరోయిన్ మధ్య జరిగే కన్వర్సేషన్స్ అయితే మరీ బోరింగ్ అనిపిస్తాయి. వాళ్ళ పాత్రలకి సరైన ఇంపాక్ట్ లేదనిపిస్తుంది. ఓ వైపు తండ్రి పరువు కోసం చూస్తుంటే కూతురు ఇలా ప్రేమ అంటూ వెళ్ళిపోవడం చాలా సినిమాల్లో చూశాం‌‌. దీన్నే సాగదీసారు. మళ్ళీ అదేనేరా బాబు అనిపించేలా కొత్త టైటిల్ తో ఈ సినిమాని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. సినిమా మొత్తంలో బాబాయ్ అనే పాత్ర బాగుంది. 

ప్రతీ ఊళ్ళో ప్రేమకథలుంటాయి కానీ ఇద్దరు పేరుమోసిన రాజకీయ నాయకుల కొడుకు, కూతురి మధ్య లవ్ ట్రాక్ అంటే కాస్త ఆసక్తికరంగా భిన్నంగా ఉంటుంది. అయితే దీనిని దర్శకుడు లింక్ అప్ చేయడంలోనే అసలు విజయం ఉంది. అది ఈ సినిమాలో లోపించింది. సినిమాలో మొదటి పది నిమిషాల్లో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య సాగుతున్న పాతగొడవలని చూపించిన తీరు బాగుంది. బస్ లో జరిగే సీన్ ఒకే.‌ అడల్ట్ సీన్లు లేవు. ఫ్యామిలీతో కలసి ఓసారి చూసేలా తీర్చిదిద్దారు. రాయలసీమ యాస పర్వాలేదు. అయితే ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని అనవసరపు సీన్ల వల్ల ఎంగేజింగ్ లేదన్న ఫీల్ కలుగుతుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మార్కస్ ఎం నేపథ్య సంగీతం ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

ఆడుకాలం నరేన్, శత్రు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ నటన ఒకే. మిగతా వారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 

ఫైనల్ గా : స్లోగా సాగే కథనం..డీసెంట్ పొలిటికల్ డ్రామా జస్ట్ ఒకే.

రేటింగ్: 2 / 5

✍️. దాసరి  మల్లేశ్


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here