స్టార్ హీరోల సినిమాల కలెక్షన్లను ఎంతో కొంత ఫేక్ చేయడం అనేది కామన్. మేకర్స్ ప్రకటించిన కలెక్షన్స్ కి, ట్రేడ్ కలెక్షన్స్ కి 10-20 శాతం వ్యత్యాసం ఉండటం చూస్తూనే ఉంటాం. ప్రతి స్టార్ సినిమా విడుదలైనప్పుడు ఇలా కలెక్షన్ల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. మేకర్స్ ప్రకటించిన కలెక్షన్స్ కరెక్ట్ అని ఫ్యాన్స్ అనడం, కాదు ట్రేడ్ లెక్కలే కరెక్ట్ అని యాంటీ ఫ్యాన్స్ అనడం చూస్తుంటాం. ఇదంతా మామూలుగా జరిగే తతంగమే. కానీ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఇది మరో స్థాయికి వెళ్ళిపోయింది. (Game Changer)

 

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ మూవీ, మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది అంటూ అఫీషియల్ పోస్టర్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ట్రేడ్ వర్గాలైతే ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేదని అంచనా వేశాయి. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. రూ.186 కోట్లు కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్, అందులో సగం కూడా కలెక్ట్ చేయలేదని యాంటీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. (Ram Charan)

 

ఇంకో విషయం ఏంటంటే, ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ అనేది అసలు దిల్ రాజు బ్యానర్ అయిన ఎస్.వి.సి అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ కాలేదు. అలాగే రెండో రోజు నుంచి కలెక్షన్ పోస్టర్ల ఊసే లేదు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడిచింది. ‘గేమ్ ఛేంజర్’ డే-1 పోస్టర్ తో దిల్ రాజుకి ఎటువంటి సంబంధం లేదని, మెగా కాంపౌండ్ కి చెందిన ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఆ పోస్టర్ రిలీజ్ చేయించాడని టాక్ ఉంది. ఈ విషయంపై దిల్ రాజు సహా టీం అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దిల్ రాజు బ్యానర్ నిర్మించిన మరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదలై, భారీ వసూళ్లతో దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. దాదాపు అందరూ ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్ గురించి మర్చిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. (Dil Raju)

 

‘గేమ్ ఛేంజర్’ విడుదలై 20 రోజులైంది. ఇప్పటికే దాదాపు రన్ పూర్తయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ ‘గేమ్ ఛేంజర్’ లైఫ్ టైం కలెక్షన్స్ రూ.178 కోట్లు అంటూ ప్రకటించింది. దీంతో ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ పై మరోసారి చర్చ మొదలైంది. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.186 కోట్లు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఫుల్ రన్ లో కూడా ఆ మొత్తం రాబట్టలేకపోయింది అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ను ట్రోల్ చేస్తున్నారు. దాంతో, ఒక వ్యక్తి చేసిన పనికి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతుండగా.. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం, నిజానికి ‘గేమ్ ఛేంజర్’ రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని, కానీ కొన్ని వెబ్ సైట్స్ కావాలని తక్కువ చేసి చూపిస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ఒక సినిమా కలెక్షన్ గురించి ఇంత చర్చ జరగడం ఈమధ్య కాలంలో ఇదేనేమో.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here