సముద్ర స్నానం ఎందుకంటే?
నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కు తుంది. ఇక, మాప మాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు… ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘ మాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయనీ, ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ నమ్మకం.