వేదావతి కంగారు…
ధీరజ్, ప్రేమ ఇంటికిరాకపోవడంతో వేదావతి కంగారు పడుతుంది. ధీరజ్‌తో పాటు ప్రేమకు చందు ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు లిఫ్ట్ చేయకపోవడంతో వారి భయం మరింత పెరుగుతుంది. ధీరజ్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఫోన్ కూడా చేయద్దని రామరాజు అంటాడు. కన్నవాళ్లను మోసం చేసే చావు తెలివితేటలు ఉన్నాయని, వాడిని ఇంకా నమ్ముతున్న నిన్ను చూస్తుంటే జాలేస్తుందని వేదావతితో కోపంగా రామరాజు చెబుతాడు.